గ్లెండెల్‌ అకాడమీకి దేశవ్యాప్తంగా విద్యా సంస్థల పరంగా 8వ ర్యాంకు దక్కించుకుంది.

 గ్లెండెల్‌ అకాడమీకి దేశవ్యాప్తంగా  విద్యా సంస్థల పరంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. గ్లెండెల్‌ అకాడమీకి దేశవ్యాప్తంగా విద్యా సంస్థల పరంగా 8వ ర్యాంకు దక్కించుకుంది.

ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ఇండియా ర్యాంకింగ్స్‌ 2020-21లో హైదరాబాద్‌ బండ్లగూడకు చెందిన గ్లెండెల్‌ అకాడమీకి దేశవ్యాప్తంగా 
విద్యా సంస్థల పరంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. హైదరాబాద్‌, తెలంగాణ రీజియన్‌ స్థాయిలో మొదటి స్థానం లభించింది. 
దిల్లీకి చెందిన ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ అనే  సంస్థ గత 14 ఏళ్లుగా దేశంలోని ప్రముఖ  పాఠశాలలకు సంబంధించి వార్షిక ర్యాంకుల 
ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా గ్లెండెల్‌ అకాడమీకి ర్యాంక్‌లు వచ్చాయి. గ్లెండెల్‌ అకాడమీకి ఉత్తమ ర్యాంకులు వచ్చిన 
సందర్భంగా బండ్లగూడలోని పాఠశాలల్లో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లెండెల్‌ అకాడమీ డైరెక్టర్‌ అంజుమ్‌ 
బాబుఖాన్‌, అసిస్టెంట్ డైరెక్టర్ మీను సలూజ తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమీకి దేశంలోని విద్యా సంస్థల్లో 8వ ర్యాంక్‌, 
తెలంగాణ రాష్ట్రంలో తొలి ర్యాంక్‌ రావడం చాలా సంతోషంగా ఉందని ఆ సంస్థ డైరెక్టర్‌ అంజుమ్‌ బాబుఖాన్‌ సంతోషం వ్యక్తం 
చేశారు. ఈ ర్యాంక్‌ రావడం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. క్రమశిక్షణ, అంకితభావం, సమీష్టి కృషి ఫలితమే ఉత్తమ 
ర్యాంకులు రావడానికి కారణమని వివరించారు....