బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ.

బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ.

బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ.
బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షులు రఘు కిరణాచార్యులు

బ్రాహ్మణ సేవా వాహిని టీమ్

బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దాదాపు 200 మంది బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షులు రఘు కిరణాచార్యులు తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మూడాలు ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక నెలకు సరిపడా సరుకులు బ్రాహ్మణ సేవా వాహిని కమిటీ సభ్యులు అందజేశారని అన్నారు. ముఖ్యంగా చిన్నచిన్న పూజా కార్యక్రమాలు జపాలు సహాయానికి వెళ్లే పురోహితులకు వంట కార్యక్రమాలకు నిత్యం వంటలు చేసుకునే మహిళలకు ఈ నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగిందని అన్నారు. బ్రాహ్మణులకు ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా సేవ చేసేందుకు తమ బ్రాహ్మణ సేవా వాహిని సైన్యం ముందుంటుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి బ్రాహ్మణ సేవా వాహిని ముఖ్య ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ ,ప్రధాన కార్యదర్శి అభిషేక్ శర్మ, సహాయ కార్యదర్శి సందీప్ శర్మ, సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర శర్మ, సందీప్ ఆచార్యులు, ప్రచార కార్యదర్శి వెంకటేశ్వరరావు, కార్య నిర్వహణ కార్యదర్శి సుధాకర్ రావు, గ్రేటర్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కన్వీనర్ శ్రీనివాసశర్మ ,ఉపాధ్యక్షులు వేదల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పవన్ ,సహాయ కార్యదర్శి వంశీ, మహిళా వాహిని అధ్యక్షురాలు రాధమ్మ, కార్యదర్శి సునీత ,ఉపాధ్యక్షులు ప్రభా మధు, నాగేశ్వరి, సహాయ కార్యదర్శి కీర్తన, సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.