సహస్ర తులసి పూజ :-
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి లక్ష్మీవారం నిర్వహించు సహస్ర తులసి పూజ నేటి ఉదయం: 8.00 గంటలకు నిర్వహించబడినది. ఈ పూజ రుసుము రూ. 1500/-లు చెల్లించి పూజలో ఉభయదాతలు పాల్గొన్నారు.
శ్రావణ లక్ష్మీ ప్రత్యేక పూజలు
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానంలో శ్రావణమాసం సందర్భముగా లోక కళ్యాణార్ధం, భక్తజనుల అభీష్టంనేరవేర్చుటకు గాను తేది:05-08-2024 గురువారం నుండి తేది:03-09-2024 శుక్రవారం వరకు ప్రతీ రోజు “శ్రావణలక్ష్మీ ప్రత్యేక కుంకుమ పూజలు” సామూహికముగా జరుగును.
ఈ విశిష్ట సామూహిక కుంకుమ పూజలో పాల్గొను దంపతులు రూ.400/-లు ముందుగా చెల్లించి రశీదులు పొందవలేను . పూజలు పరిమితం కావున ముందుగా నమోదు చేసుకున్న వారే ఈ అవకాశం పొందగలరు. ఈ పూజ శ్రావణలక్ష్మీ ప్రత్యేక కుంకుమ పూజలు టికెట్లు దేవస్థానం నందు లభించును.
ప్రతి రోజు ఉ..9.00 గంటల నుండి గం.. 10.30 ని..లవరకు మరియు గురు మరియు శుక్రవారంలలో ఉ. గం.. 08.00 ని..ల నుండి 9.00 గం..ల వరకు మరియు ఉ..9.30 ని..ల నుండి 10.30 ని..ల వరకు జరుగును.
ఈ శ్రావణలక్ష్మీ ప్రత్యేక సామూహిక పూజలలో పాల్గొను భక్తులకు అవసరమగు పూజా ద్రవ్యములు దేవస్థానం వారిచే సమకూర్చబడును. పూజలో పాల్గొను ఉభయదాతలకు పూజ అనంతరము అమ్మవారి ప్రసాదములు శేష వస్త్రములు ఇవ్వబడును.
ఈ సామూహిక పూజలో పాల్గొను భక్తులు పూజ రోజున పూజకు 20 నిమిషముల ముందుగా దేవాలయములో అనివేట్టి మండపమునకు హాజరుకావలెను. పూజకు సాంప్రదాయ దుస్తులు అనగా పంచే, చీర దరించి పూజలో పాల్గొనవలసియున్నది.
సహస్ర తులసి పూజ :-
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించు సహస్ర తులసి పూజ నేటి ఉదయం: 09.00 గంటలకు నిర్వహించబడినది.
ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది మరియు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వి. రాంబాబు మరియు సిబ్బంది, భక్తులు పాల్గొనుట జరిగినది.
పరోక్షముగా పూజ చేయించుకోదలచిన భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎకౌంటు నెం. 060810011006691, IFSC కోడ్ UBIN0806081కు జమచేస్తూ వారి యొక్క పేరు, గోత్రం మరియు అడ్రసు వివరములు 8985515989 మొబైల్ నెం. కు వాట్సెప్ పంపవలెను. మరియు ఆన్ లైన్ సేవలు/పూజలు టిక్కెట్లు aptemples.ap.gov.in website ద్వారా లబించును.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో లక్ష్మీవారం నిర్వహించు సహస్ర తులసి పూజ
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో లక్ష్మీవారం నిర్వహించు సహస్ర తులసి పూజ
