ఈరోజు శ్రీరంగగిరి సందర్శనకు విచ్చేసిన విశిష్ట అతిథి కీసర దేవస్థానంలో వేదపారాయణ పం

ఈరోజు శ్రీరంగగిరి సందర్శనకు విచ్చేసిన విశిష్ట అతిథి కీసర దేవస్థానంలో వేదపారాయణ పం ఈరోజు శ్రీరంగగిరి సందర్శనకు విచ్చేసిన విశిష్ట అతిథి కీసర దేవస్థానంలో వేదపారాయణ పం

జై శ్రీమన్నారాయణ

ఈరోజు శ్రీరంగగిరి సందర్శనకు విచ్చేసిన విశిష్ట అతిథి కీసర దేవస్థానంలో వేదపారాయణ పండితుడు, తెలంగాణ దేవాలయాల అర్చక పరిషత్ అధ్యక్షులు, మాకు అత్యంత ఆత్మీయులు బ్రహ్మశ్రీ మారుతి సత్యనారాయణ మూర్తి గారు...
వేకువనే రంగనాథుని సన్నిధికి సతీసమేతంగా విచ్చేసి, తిరుప్పావై శేవాకాలం ఆసాంతమూ అన్వయించారు.
అనంతరం జరిగిన గోదామాత పల్లకి సేవలో స్వయంగా పల్లకీ మోశారు...
పుష్కరిణి వద్ద హారతి సమర్పించారు...
స్వామికి గజమాల సమర్పణలో వేదవిన్నపం చేశారు..ఈ స్థలంలోనే ఏదో మహత్తు వుందని వారు చెప్పడం అమితమైన ఆనందాన్ని కలిగించింది...

రేపు వైకుంఠ ఏకాధశి పర్వదినం...
ముక్కోటి దేవతలు గరుఢారూఢుడైన స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుంటారని ప్రతీతి...
వేకువజామున 5-30 ని. లకు వైకుంఠ ఉత్తరద్వారతోరణ అర్చన జరుగుతుంది...
అనంతరం శ్రీభూసమేతుడైన శ్రీరంగనాథుని దివ్య దర్శనం వుంటుంది...
భగవద్బంధువులందరూ ఉదయాన్నే వైకుంఠద్వారం గుండా స్వామిని దర్శించుకొని సకల శుభములు పొందవలసిందిగా ప్రార్థన...

డా.ధనుంజయ..