శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు )ని పురస్కరించుకొని భద్రగిరి ప్రదక్షిణా క

 శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు )ని పురస్కరించుకొని భద్రగిరి ప్రదక్షిణా క  శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు )ని పురస్కరించుకొని భద్రగిరి ప్రదక్షిణా క

 శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు )ని పురస్కరించుకొని భక్తరామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావుగారి ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భద్రమహర్షి తపస్సు ఫలితంగా వైకుంఠం నుండి శ్రీమన్నారాయనుడే స్వయంగా భద్రమహర్షిపై కాళిడిన పుణ్యప్రదేశం. 
యః పూజయతి శ్రీరామా!

నక్షత్రే తు పునర్వసౌ!

తస్య సర్వాణి సౌఖ్యాని

దీయతే రఘుసత్తమ||

శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున భద్రాచల శ్రీరామచంద్ర ప్రభు పూజించిన సకల శుభములు ప్రాప్తిస్తాయి. ఆలయంలో స్వామివారి పాదప్రదక్షిణ చేయుటకు వీలుకాదు కనుక గిరిప్రదక్షినే సులభమార్గం కనుక అట్టి కార్యక్రమం పునర్వసు రోజు ప్రారంభిస్తున్నాము. ఈకార్యక్రమ నిర్వహణకు మార్గదర్శనం చేసిన స్థానాచార్యులు శ్రీ కె. ఈ. స్థలశాయిగారికి, అధర్వన వేదపండితులు శ్రీ మురళీకృష్ణమాచార్యులవారికి, గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయుటకు అనుమతించిన ఈవో యల్. రమాదేవిగారికి ధన్యవాదములు తెలియజేసారు. ఇప్పటినుండి ప్రతీ పునర్వసు నక్షత్రంరోజు ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈకార్యక్రమంలో భక్తరామదాసు ట్రస్ట్ నిర్వాహకులు, భక్తరామదాసు పదవతరం వారసులైన కంచర్ల శ్రీనివాసరావు, భద్రాచలం  జీయరుమఠం నిర్వాహకులు వెంకటాచారిగారు, వనంమాట నిర్వాహకులు వనం లక్ష్మణానందగారు, సుదర్శన్ టీవీ చైర్మన్ రామకృష్ణాచార్యులు, కోరి నిఖిల్, ముక్తీశ్వర్ దారా, మరియు రామభక్తులు పాల్గొన్నారు.....